పాలకొండ ( జనస్వరం) : భామిని మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రుంకు కిరణ్ కుమార్ అధ్యక్షతన "హాలో ఏపీ, బైబై వైసిపి" అనే నినాదంతో కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నిన్న వాలంటరీ వ్యవస్థ చేపట్టిన నిరసనను వ్యతిరేకిస్తూ, వాలంటరీ వ్యవస్థ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు పూర్తిగా విని మాట్లడాలని, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు నమ్మకుండా మీ మనసు సాక్షి తో ఆలోచించి మాట్లాడాలన్నారు. మీరు ప్రజల కట్టిన పన్నుతో జీతాలు తీసుకొని పాలక వర్గం కి సేవ చేయకుండా, ప్రజలకి మీ సేవలు అందించాలని.. మీరు ఇలాంటి ధర్నా లో మండలం లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు పైన , ప్రదాన రహదారి పైన చేసి ఉంటే బాగుండేది అని అన్నారు. మండలం లో ఉన్న అధికార నాయకులు కూడా వాలంటీర్లు వ్యవస్థ ని అడ్డ పెట్టుకొని ఎలాంటి దుష్పప్రాచారాలు చేయకుండా మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు పైన ద్రుష్టి సారించి, ప్రజలకి మేలు జరగే పనులు చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు Ex -ZPTC సభ్యులు నిమ్మల నిబ్రమ్, ఉప అధ్యక్షులు కొత్తకోట వైకుంఠ, దాసరి మహేష్, గోరిశెట్టి ఉమ శంకర్, దీపక్ కళ్యాణ్, లోపెంటి రమేష్ , సింహాచలం, హరిబాబు, పసుపురెడ్డి కిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com