జగ్గంపేట ( జనస్వరం ) : జగ్గంపేట నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని జనసేన టిడిపి పార్టీల ఆధ్వర్యంలో గోకవరం మండలం గోకవరం గ్రామం నుండి తంటికొండ గ్రామం వరకు 3 కిలోమీటర్లు మరియు గోకవరం నుండి రంపయర్రంపాలెం గ్రామం వరకు 4 కిలో మీటర్ల మేర జనసేన టిడిపి నాయకులు అంతా కలిసి పాదయాత్ర చేసి సంయుక్త నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గోకవరం మండల కేంద్రమైన గోకవరం నుండి వెంకటేశ్వర స్వామి పుణ్య క్షేత్రమైన తంటికొండ వరకు సుమారు 3 కిలోమీటర్లు రోడ్డు, మరియు గోకవరం నుండి రంపయర్రంపాలెం గ్రామం వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డు కూడా కనీసం మనుషులు నడుచుకుంటూ కూడా వెళ్లలేని పరిస్థితిలో రోడ్లు ఉన్నాయని, రాత్రి పూట ఇలాంటి రోడ్లలో ప్రయాణం చేస్తే ఆ చీకట్లో గుంతలమయమైన రోడ్డు సరిగా కనిపించక ఎక్కడ ప్రమాదాలకు గురౌతామో అని ప్రజలు ఎవరైనా కానీ ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేయాలంటే చాలా భయబ్రాంతులకు గురవుతున్నారు. పుణ్యక్షేత్రమైన తంటికొండ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చేవారిని కానీ ఇప్పుడు ఉన్న ఈ రోడ్డు దుస్థితిని చూసి భక్తుల రాక కూడా క్రమక్రమంగా తగ్గిపోయిందని గ్రామ ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగా లేక ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లాలనుకునే ముసలి వారు మరీ ముఖ్యంగా కాన్పు కోసం గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఇలాంటి రోడ్లపై హాస్పిటల్ కి వెళ్ళాలంటేనే చాలా భయపడుతున్నారని చెప్పారు. అంతే కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన నెల రోజులలోనే పాడైపోయే గుంతలు, గతుకులు మయంగా మారిన అన్ని రోడ్లు నిర్మించే ప్రక్రియ మొదలుపెట్టి పక్కా రోడ్లుగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com