
నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపేలా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు సూళ్లూరుపేట మండల ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వల్లూరు కిరణ్ కిరణ్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని దానికి తోడు పెంచిన విద్యుత్ చార్జీలు నడ్డి విరిచే లోపు ఎడతెరిపి లేని విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శ తీపలపూడి రమణ, జనసైనికులు సుబ్బరాజు, మురళి, జయ, విజయ్ ప్రశాంత్, సునీల్, కిరణ్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.