మదనపల్లి ( జనస్వరం ) : విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మదనపల్లి జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాప్తాడులో ఆంధ్ర జ్యోతి విలేకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విలేకరులు ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యురాలు దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు జగదీష్ బాబు, మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి, గణేష్ తొక్కళ్ళ శివ, యాసిన్ , శ్రీనాథ్ ,సత్య, సంతోష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com