నెల్లూరు ( జనస్వరం ) : పేదలకు హౌస్ ఫర్ ఆల్ కింద కేటాయించిహాల్సిన ఇళ్ల స్థలాలను స్థానిక నాయకులు ఖబ్జా కోరల నుంచి కాపాడండి అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరమేశ్వరి నగర్ బలిజ భవన్ కు దగ్గరగా ఉన్న సర్వే నంబర్ 158.. గచ్చికాలవ కట్టమీద నివసిస్తున్న పేదలకు ఉచితంగా ఇవ్వాలని 85 సెంట్లు భూమి సర్వే చేయించి 48 ప్లాట్లను రోడ్లు పోను 6 అంకణాలుగా విభజించడం జరిగింది. అక్కడ ప్రజలు ఇక్కడ కు రావడానికి ఒప్పుకోకపోవడం, స్థానికులు ఇక్కడే నివశిస్తున్న ఇల్లు కావాలని కోరుకోవడం తో కోర్టులో కేసు తో పేదలకు పంచకుండా నిలిచిపోయింది. ఆ స్థలాన్ని స్థానిక నాయకుల చేతివాటంతో సచివాలయ సిబ్బంది చొరవతో ఆ ఖాళీ ప్రదేశాలకు వీఎల్టి వేకెడ్ ల్యాండ్ టాక్స్ వేసి ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి సొంత స్థలంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంత దారుణం జరుగుతున్నా పలు మార్లు పేపర్లో వచ్చి ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకు వచ్చినా అందరూ చోద్యం చూస్తూనే ఉన్నారు. కావున కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాలను వేకిడ్ ల్యాండ్ టాక్స్ వేయించిన సిబ్బందిని,ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసిన వారి పై కేసు నమోదు చేసి శిక్షించాలి. అదేవిధంగా ఆ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా రిజిస్ట్రేషన్ రద్దు పరచాలి.అందుకు సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతూ అక్కడ ఫెన్సింగ్ వేయాలని కోరుతున్నామాని తెలిపారు. జగనన్నకి చెబుతాం అంటూ నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇష్యూస్ గురించి చెప్పాము. సాంకేతిక లోపాల వల్ల మా సమస్యలు పరిష్కరించలేకపోతున్నామంటున్నారు. అందులో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా, పెత్తందారుల భూ ఖబ్జాలు, పేదల ఇల్లు ఆలస్యం లాంటి అనేక సమస్యలు చెప్పి తెలిపిన కూడా సాంకేతిక లోపాల కారణంగా జగనన్న పలకడం లేదు. పేదలకు ఇవ్వాల్సిన స్థలాలు అన్యాక్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకోం జనసేన పార్టీ తరఫున నిరసనలు చేసి పేద ప్రజలకు స్థలాలు అందే దాకా కూడా పోరాటం చేస్తామన్నారు. సహజ సంపదలు దోపిడికి గురి అవ్వకుండా ఉండాలన్నా... పేదలకు న్యాయం జరగాలన్నా.. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్నా... ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి జనసేన, తెలుగుదేశం పార్టీలు గెలిపించి ప్రజా ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కేఎస్సెస్ జిల్లా అధ్యక్షులు సుధా మాదవ్, జిల్లా జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహాన్, ఖలీల్, కేశవ, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com