Search
Close this search box.
Search
Close this search box.

సర్వేపల్లి రిజర్వాయర్ ని గ్రావెల్ మాఫియా కబంధ హస్తాల నుంచి కాపాడండి : సర్వేపల్లి జనసేన నాయకులు

సర్వేపల్లి

              వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలను సోమవారం జనసేన జిల్లా కమిటీ సభ్యురాలు పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, నాయకులు అవినాష్, సాయి, విష్ణు, చందన్, వంశీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేత పట్టుకొని నిరసన తెలిపారు.  సర్వేపల్లి రిజర్వాయర్ పై రాజకీయాలు చేయడం మానుకుని అభివృద్ధి చేయండని అన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో మట్టి తవ్వకాలకంటూ తీసుకున్న అనుమతుల కన్నా ఓ నెలపాటు స్థానిక అధికార పార్టీ నాయకులు అక్రమంగా భారీ ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జరిపి ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా భారీ గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి విచారణ పరిశీలనకై ఓ ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపారు. గత నాలుగు రోజుల క్రితం వచ్చిన అధికార బృందాన్ని స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీ నాయకులతో కలిసి పక్కదోవ పట్టించారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో ఎంతమేరకు అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయో తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భారీ స్థాయిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయి కాబట్టే అధికారులు విచారణ చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. మట్టి తవ్వకాల పేరుతో తీసుకున్న అనుమతులు కన్న భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేసిన వారిని కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ గ్రావెల్ మాఫియాకి సహకరించిన ఇరిగేషన్ అధికారులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన తరపున తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో అధికార వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టడం అధికార పార్టీకి అలవాటుగా మారిందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై పూర్తి విచారణ చేపట్టాలని జనసేన తరపున తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way