Logo
Date of Publish : 10 October 2022, 1:27 am
Editor : Sake Naresh

మహమ్మద్ ప్రవక్త బోధనలు స్ఫూర్తిదాయకం – పవనన్న ప్రజాబాటలో జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 146వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పర్వదినమైన మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలను ముస్లిం సోదరులకు తెలియజేసారు. కరుణ, సహనం, ఐక్యత, సామరస్యం వంటి ప్రవక్త బోధనలు ప్రజలందరికీ నిత్యం స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయన్నారు. తోటి వారికి సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొంది, సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు మరింత కృషి జరగాలని, సర్వమతాలను గౌరవించే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో జనసేనపార్టీ సైనికులుగా తాము నిరంతరం ఈ దిశగా కృషి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com