చెత్త సేకరణ పై పన్ను వేసే విధానం రద్దు చేయాలని నగరపంచాయితీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ మరియు పాలకొండ పట్టణ పౌరహక్కుల పోరాట వేదిక వారితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఇంటి పై వేసే విధానాన్ని ఉపసంహరించు కోవాలని జి ఓ నెంబర్ 196, 197, 198 లను రద్దు చేయాలని కోరుటూ జీవో రద్దు అయ్యే వరకు దశలవారీగా ఉద్యమం చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన ఆస్తి విలువ పై ఇంటి పన్ను విధానాన్ని పునః పరిశీలన చేయాలని కోరుతూ ప్రస్తుత పాలకపక్ష బోర్డు లో పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేసి పాలకొండ నగర పంచాయతీ నుంచి పంపాలని శ్రీయుత పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు గారికి వినతి పత్రంను గర్భాన సత్తిబాబు గారు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పోరాట వేదిక సభ్యులు బుడితి అప్పలనాయుడు, వండాన కూర్మారావు మరియు జనసేన పార్టీ గొర్ల మన్మథ రావు, పోట్నురు రమేష్, గెంబాలి సంతోష్ కుమార్, గర్బాపు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com