
ప్రజల పైన సేవా రుసుముల భారం మోపకుండా ఆస్తి పన్ను మరియు చెత్త పన్ను పెంపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని జనసేన నాయకులు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గూడూరు పురపాలక కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వహక కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ అసలే కరోనా కష్ట కాలంలో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో చెత్త పైన సేవా రుసుముల వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడు కార్యక్రమానికి పూనుకోవడం తగదన్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను పెంపు పైన పేద, అణగారిన వర్గాలు మరియు మధ్యతరగతి ప్రజలు ఆందోళన పడుతుంటే కొత్తగా కేవలం చెత్త పైన ప్రతి ఇంటి నుంచి నెలకు 90/- రూపాయల, సంవత్సరానికి 1080/- మరియు షాపులు నుండి నెలకు 120/- పైన వసూలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను ఆదేశాలు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అలివేలు రాజశేఖర్, మల్లి ధనుంజయ సనత్, మోహన్, ఉప్పు సాయి, చెన్నపట్నం కోటి, పొలిపాటి గోపి, కొమ్మూజీ సూరజ్ తదితరులు పాల్గొన్నారు.