Logo
Date of Publish : 29 October 2022, 3:41 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ పాఠశాలలో సరియైన సదుపాయాలు కల్పించాలి : రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్

   రాజంపేట, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో మడితాడు గ్రామ పంచాయతీలో గల గుట్టకింద రాచపల్లిలో ఉండే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనసేన నాయకులు రామ శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. విద్యార్థినీ, విద్యార్థులు మొత్తం 430 సంఖ్యలో ఉండగా ఆ స్కూలులో మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన వంటలను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేసి అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలో  త్రాగు నీరు సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం, పాలకులు వెంటనే యుద్ధప్రాతిపదికన త్రాగు నీరు కొరతను పరిగణలోకి తీసుకుని తక్షణ నిధులు మంజూరు చేసి త్రాగు నీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని అలానే స్కూల్ కు వెనుక వైపు పురాతనమైన ప్రహరీ గోడ అద్మానంగా ఉండడం గుర్తించి భద్రత కల్పించాలని సంబంధిత శాఖ అధికారులు స్కూల్ లో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం, పాలకులు, అధికారులు ద్వారా విచారణ జరిపి వెంటనే అక్కడి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సుమలత, ఉపాద్యాయులు, విద్యార్థులు, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com