అరకు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు ఆంధ్ర ప్రజానీకానికి అర్థం కాక ఏక్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి జరుగుతుంది? తప్పుడు హామిలిచ్చి మోసం చేయడం ఆ తప్పును జనాల్లోకి తీసుకెళ్తే కొత్త ప్రకటనలు కొత్త హామీలు కొత్త పథకాలు పెట్టి ప్రజలను పక్క దారి పట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరితేరిపోయింది దేశం అంతటా కొత్త జిల్లాల ఏర్పాటు నిషేధం ఉంది. మరి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన దేనికోసం ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదేమైనా విపత్తు సమయమా ఒక్క రోజులొనే ఆన్ లైన్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై పనులు పూర్తి చేశారు. తక్కువ సమయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశం పెట్టి ఆన్లైన్ లొనే కొత్త జిల్లాల ప్రక్రియ హడావుడిగా ఆమోదం తెలపడం వెనుక అంతర్యం ఏమిటి? ఇదేమైనా విపత్తు సమయమా లేదా ఉద్యోగుల సమస్యకంటే ముఖ్యమైందా! ఉద్యోగుల ఉద్యమం వేళా ఈ ఎత్తు గాఢ అందుకోసమేన. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమేనా అని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.