Logo
Date of Publish : 02 May 2022, 4:43 pm
Editor : Sake Naresh

విజయనగరంలో మొక్కుబడిగా రోడ్డు నిర్మాణం పనులు : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

● నత్తనడకన రోడ్డు నిర్మాణం పనులు
● గడువు ముగిసినా ఇటు అధికారుల్లోను, అధికార పార్టీ వారికి చలనం లేదు

     విజయనగరం, (జనస్వరం) : నగరంలోని అత్యంత జనాలతో రద్దీగా ఉండి ప్రాధాన్యత కలిగిన మయూరి జంక్షన్ నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు చేపట్టిన రోడ్డు, సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా అధికార పార్టీ జాప్యంఫై ద్వజమెత్తారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ గడువు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు సకాలంలో జరగలేదని ఆరోపించారు. ప్రతినిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డులో నిర్మాణం పనులు నాణ్యత లేకుండా తూతూమంత్రంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈ రోడ్డుపై నడవలేక,వాహనాలను నడపలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 92.10 లక్షల రూపాయల అంచనాలతో టెండర్లు పిలువగా 83.33 లక్షల రూపాయలకు కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారని, గత ఏడాది సెప్టెంబర్ 4వతేదీన సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వగా అక్టోబర్ 4వతేదీన అగ్రిమెంట్ కుదిరినా అగ్రిమెంట్ ప్రకారం ఈఏడాది జనవరి 19వతేదీన లోగా మూడు నెలలలో పని పూర్తి చేయాలని, అయితే గడువు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ద్వజమెత్తారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతున్నా! అసలు కాంట్రాక్టర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. నగరంలో అభివృద్ధి పనులు జోరుగా చేపడుతున్నామని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోడ్డు నిర్మాణ పనులపై కన్నెత్తి చూడటం లేదు. సెంటర్ డివైడర్ నిర్మాణానికి చేపట్టిన సిమెంట్ పనులకు పూర్తిస్థాయిలో వాటరింగ్ కూడా చెయ్యక ఫలితంగా డివైడర్ బీటలు వారుతుందని అన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే, సదరు అధికారులు చొరవ తీసుకొని మధ్యలో ఆగిపోయిన రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని జనసేన తరుపున కోరుతున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com