Logo
Date of Publish : 24 February 2023, 4:36 pm
Editor : Sake Naresh

లాభసాటిగా వ్యవసాయ రంగం జనసేనతోనే సాధ్యం : మనుబోలు గణపతి

       సర్వేపల్లి ( జనస్వరం ) : "ఆంధ్రా అభివృద్ధి - జనసేనతోనే సాధ్యం" కార్యక్రమం 36 వ రోజు ముత్తుకూరు మండలం,దమ్మయ్య పాలెం గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, దమ్మయ్య పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ టీడీపీ హయాంలో, ఇప్పుడు వైసీపీ అధికారంలో మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు. వ్యవసాయ శాఖ నిర్వర్తిస్తూ ఆ శాఖకి న్యాయం చేయలేకపోయారు. కానీ రైతే రాజు అంటారు, కానీ ఈ ప్రభుత్వంలో ఇన్ని ఆత్మహత్యలు ఎలా జరిగాయి? చనిపోయిన కౌలు రైతులకు ఏం న్యాయం చేయలేకపోయారు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాలో సంపాదించిన తన కష్టార్జితాన్ని 3000 మంది చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకున్నాడు. రైతులకు న్యాయం చేసే ఇలాంటి నాయకుడిని వదులుకున్నామంటే వ్యవసాయ రంగం ఎప్పయికి అభివృద్ధి చెందదు. జనసేనపార్టీ అధికారంలోకి వస్తే లాభసాటిగా వ్యవసాయ రంగం మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది.తాండ్ర శ్రీను,సతీష్ గౌడ్ పాల్గొన్నాడు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com