Logo
Date of Publish : 21 January 2022, 5:14 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

 - ఉద్యోగులతో కలిసి ఉద్యమబాట పడతాం.

 - జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

     శింగనమల, (జనస్వరం) : ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండే ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యోగులతో కలిసి జనసేన ఉద్యమ బాట పడుతుందని జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు, ఆందోళనలకు దిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందన్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులతో వైరం పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ ఎక్కువ కాలం సాగించలేదని, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడను స్వస్తి పలికి ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకపోతే జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ గారి సారధ్యంలో వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జనసేన బాసటగా నిలుస్తుందని ఆయన తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com