
శింగనమల, (జనస్వరం) : మండల పరిధిలోని నాగులగుడ్డం తండాలో స్మశానవాటికకు దారి అడ్డగించడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో చాలా గ్రామాలలో వుండాయి అనడానికి యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామంలో మొన్న జరిగిన స్మశానవాటిక సంఘటన, ఈరోజు నాగులగుడ్డం తాండలో జరిగిన సంఘటనలే ఉదాహరణ శింగనమల నియోజకవర్గములో SC కాలనీ వాసులకు స్మశానవాటికలకు దారులు మూసివేస్తున్న అగ్రవర్ణాల వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు సాకే మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామాలలో స్మశానవాటిక దారి సమస్యలకు అధికారులు స్పదించి పరిష్కరించాలని లేకపోతే జనసేన పార్టీ తరుపున గ్రామాలు తిరిగి ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.