Logo
Date of Publish : 18 May 2022, 4:44 pm
Editor : Sake Naresh

వైకాపా ప్రభుత్వ పాలనలో గడప గడపలో సమస్యలే : దారం అనిత

     మదనపల్లి ( జనస్వరం ) : ఈ నెల 11 నుండి వైకాపా ఎమ్మెల్యేలు చేపట్టిన గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలను రోడ్లమీద నిలదీసి వారిని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, మహిళలకు రక్షణ మహిళలపై తరచుగా జరుగుతున్న దాడులు, ఇలా ప్రతి ఒక్క సమస్య మీద ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఎన్నికల అప్పుడు కనిపించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కనిపిస్తున్నారని నిలదీసిన రోజులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యేలను అసలు ఊర్లోకి రానివ్వడం లేదు. మురుగు కాలువలు రహదారుల నిర్మాణం చాలా ఇబ్బంది పెడుతోంది అని, చాలాచోట్ల మంచినీటి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గళమెత్తారు. అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్న భవనాలు పెచ్చులు ఊడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సెలవుల్లో బడులను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చాలా అద్వానీ స్దితికి చేరుకున్నాయి. వర్షం కురిసినప్పుడు బురద నీరు నీరు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిమీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కనీసం గుంతలను పూడ్చాలని కోరారు. నిత్యావసర ధరలు పెంచడంతోపాటు పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ చార్జీలు వైకాపా ప్రభుత్వంలో ఊహించని స్థాయికి పెరిగాయని ఆదాయం లేని రాష్ట్రంలో ఎలా బతకాలి ఈ విధంగా రేట్లు పెంచారు అని ప్రజలు ప్రభుత్వాని విమర్శించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com