తెలంగాణ, (జనస్వరం) : సమస్య మీది - సమరం మాది కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు యొక్క సూచన మేరకు శ్రీ నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్ల యొక్క దుస్థితిని పరిశీలించడం జరిగింది. వర్షాల వల్ల హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్లు తీవ్రంగా పాడైపోయిందని ప్రజలు మరియు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. గతంలోనూ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పుడైనా సమస్యను పరిశీలించి రోడ్లు వేయాలని లేనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య, రామకృష్ణ, గోవర్ధన్, రాము, తేజ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com