Logo
Date of Publish : 25 May 2021, 3:30 pm
Editor : Sake Naresh

ప్రయివేటు టీచర్స్ కి రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలి : పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రాంసుధీర్

                  ప్రయివేటు టీచర్స్ కి రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలి
• ప్రతి నెలా నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలి
• విద్యాబడ్జెట్ లో ప్రైవేటు టీచర్ల ప్రస్థావనే లేదు
• అధ్యాపకుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి
• రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి
• ఇప్పటికే 100 మంది వరకు బలవన్మరణాలకు పాల్పడ్డారు
• ప్రభుత్వం ప్రయివేటు టీచర్లను పట్టించుకోవాలి
                   ఒకప్పటి బతకలేని బడిపంతులు సామెత నేటి ప్రైవేటు టీచర్ల దుస్థితికి అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి గురువుల జీవితాల్లో చీకట్లు నింపింది. యాజమాన్యాలు సెలవు కాలానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 14 నెలలుగా కుటుంబ పోషణ కోసం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. మాస్టారు గారు అన్న గౌరవాన్ని వదిలి చాలా మంది మనసు చంపుకుని రోజు కూలీలుగా, రోడ్ల వెంట ఫుట్ పాత్ వ్యాపారులుగా మారి జీవనం కొనసాగిస్తున్నారు. కొంత మంది అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి. గడచిన ఏడాది కాలంలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రైవేటు టీచర్ల పట్ల ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. యాజమాన్యాలు జీతాలు ఇవ్వాలంటూ జీవోలు విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రైవేటు టీచర్ల పాట్ల కాస్తయినా కనికరం చూపి నెలకి రూ. 2 వేల భృతి, 25 కేజీల బియ్యం ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారు.
                 రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 5 లక్షల మంది వరకు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం నుంచి ఆర్ధిక భరోసా కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారికి గుర్తింపు ఇవ్వాలి. వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలి. కోవిడ్ కాలంలో జీతం కోల్పోయిన ప్రతి ప్రైవేటు టీచర్ కు, బోధనేతర సిబ్బందికి నెలకు రూ. 5,000 గౌరవ వేతనం ఇవ్వాలి. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతి నెల నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు టీచర్ల స్థితిగతులు మార్చేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే వారిని ఆదుకోవాలి. విద్యా బడ్జెట్ లో మీ పార్టీ నేతలు దోచుకోవడానికి వేల కోట్లు విడుదల చేశారు. అష్టకష్టాలు పడుతున్న ప్రైవేటు టీచర్ల ఊసు కూడా ఎత్తలేదు. లక్షల కుటుంబాలు రోడ్డున పడినా శ్రీ జగన్ రెడ్డి గారి గుండె కరగడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసైనికులు కోవిడ్ కాలంలో తమకు తోచిన సాయం గౌరవ అధ్యాపకులకు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా వారికి గౌరవ వేతనం అందించాలి.

 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

 

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com