Logo
Date of Publish : 27 September 2026, 7:59 am
Editor : Sake Naresh

జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యం

- శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో దిగ్విజయంగా ముగిసిన మెగా ఉచిత వైద్య శిబిరం

- 185 మందికి వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ

- ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సేకరణకు చర్యలు: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్

సెప్టెంబర్ 26, జనస్వరం ప్రతినిధి (అనంతపురం): రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘మెగా ఉచిత వైద్య శిబిరం’ దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ‘జాప్’ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్, డీఎం అండ్ హెచ్‌ఓతో పాటు అనంతపురం జిల్లా జాప్ అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, పలు జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం వృత్తి ధర్మంలో నిమగ్నమై తమ ఆరోగ్యాన్ని, కుటుంబ పరిస్థితులను విస్మరిస్తున్నారని, దీనివల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని, అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు దయనీయ స్థితికి చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి జర్నలిస్ట్ తప్పనిసరిగా హెల్త్ కార్డులు పొంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వైద్య సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పెన్షన్, పత్రికా యాజమాన్యాల జీతాల సమస్యలపై ప్రభుత్వాలు క్రమశిక్షణతో కూడిన స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ దశాబ్దం క్రితం జర్నలిస్టుల సంఖ్య తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరగడంతో అర్హులైన జర్నలిస్టులను గుర్తించడం సవాలుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు (అక్రిడేషన్) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అక్రిడేషన్ ఉన్నప్పుడే ఉచిత వైద్యం, విద్య, ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ పథకాలు సక్రమంగా అందుతాయని తెలిపారు. ఉప్పల లక్ష్మణ్ సూచన మేరకు జర్నలిస్టులందరూ తమ ఆరోగ్యం పట్ల నిరంతరం జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఖాళీ స్థలాలను పరిశీలించి సేకరించాలని రెవెన్యూ అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి డీఎం అండ్ హెచ్‌ఓ, వైద్యాధికారులతో సంప్రదించి ఈ మెగా వైద్య శిబిరానికి పూర్తి సహకారం అందించామని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య సేవలు పొందారు. మొత్తం 185 మంది లబ్ధిదారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 110 మంది పురుషులు, 75 మంది మహిళలు ఉన్నారు. 31 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆర్థో (ఎముకలు), న్యూరో (నరాలు), ఈఎన్‌టీ (ముక్కు, చెవి, గొంతు), స్త్రీల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల నివేదికలతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com