కార్వేటినగరం, మండలంలోని కృష్ణాపురం జలాశయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.యుగంధర్ పొన్న కోరారు. అంతర్ రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్ననిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఇసుక అక్రమ రవాణాను ఖండించాడు. కుశస్థలి నది కార్వేటినగరం, ఎన్ఆర్ పురం మండలం మధ్యలో ఉండడంతో రెండు మండలాల సంబంధించిన అధికారులను సందిగ్గంలో పెట్టి అర్ధరాత్రి వేళల్లో హిటాచి టిప్పర్ లారీ ట్రాక్టర్ లద్వారా యధేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేసి లక్షలాది రూపాయాలను దండుకోవడం ఇసుక మాఫీయాకి సులువుగా మారుతుంది. ఇసుక మాఫియా దందాకు స్థానిక నాయకులు కూడా సహకరిస్తున్నట్లు రహస్య సమాచారం. ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా ఇసుక అక్రమ రవాణా జరగడం మరియు అధికార పార్టీకి చెందిన కొందరు చోటా నాయకులు సహకరించడం ఇదంతా ఉప ముఖ్యమంత్రికి తెలియకనే జరుగుతుందా అన్నఅనుమానం వ్యక్తమవుతుందన్నారు. స్టలంలో జనసేన నాయకులు ప్రజలు గృహాలు నిర్మించుకోవాలంటే ఇసుక దొరక్కుండా ఇలా మొత్తం ఇసుకను దోచేస్తుంటే సామాన్య ప్రజలు ఎలా ఇల్లు కట్టుకోవాలి అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నమన్వయకర్త శోభన్ బాబు నాయకులుధన, సాయి, చక్రి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com