జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నా రెడ్డి గారి పిలుపు తో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధిని పూర్తిగా విస్మరించిందని, రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ప్రకటిస్తానని తెలిపిన వై సి పి ప్రభుత్వం పదివేల లోపు ఉద్యోగాలు ప్రకటించి యువతను పూర్తిగా మోసం చేసిందని, దాదాపుగా 30 లక్షల మంది యువకుల ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది అని, చిన్నాచితకా పని చేసుకునే వారు సైతం తమ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశతో తమ సంపాదనలో కొంత పంపించి బిడ్డలను చదివిస్తున్నారనీ, వారి ఆశలను అడియాశలు చేస్తూ దాదాపు మూడు సంవత్సరాల గాను పదివేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించడం దారుణమని తెలియజేశారు. రాష్ట్ర నిరుద్యోగ యువత ఆవేదనతో తమ సమస్యను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి వినిపించటం జరిగింది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు సంకల్పంతో మొదటి విడతగా విడదలైన జాబ్ క్యాలెండర్ పై నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఒకసారి పునః పరిశీలన చేసుకుని జాబ్ కాలెండరు తిరిగి విడుదల చేయాలని స్థానిక జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్‌కి రేపు ఉదయం 11 గంటలకి వినతి పత్రం ఇవ్వబోతున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపట్టకపోతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జిల్లాలోని నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నిరుద్యోగ యువత 10 నియోజకవర్గాల్లో జనసేన ఇంఛార్జ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా యువజన విభాగ అధ్యక్షులు గునుకుల కిషోర్, సిటీ నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, కోవూరు నాయకులు భువనగిరి మురళి, కత్తి తిరుమల, దాడీ అజయ్, చెక్కా మనోహర్, బద్దెపూడి సుధీర్,పవన్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com