Logo
Date of Publish : 28 June 2022, 5:03 pm
Editor : Sake Naresh

శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ : జగన్ ను ఏకీపారేసిన జనసేన నాయకులు

      శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆమదాలవలస జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి  పేడాడ రామ్మోహన్ రావు విలేకర్లతో మాట్లాడుతూ అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు జనసేన నాయకులు అంటే ఎందుకు అంత భయం ?? మీరు చేసే ఇసుక దందాలు మరియు మీరు ఇచ్చిన హామీలు మరి ముఖ్యంగా మీరు ఆమదాలవలస నడిబొడ్డున మీరు షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తాను అని ఇచ్చిన హామీని ఎక్కడ నిలదీస్తారని హుటాహుటిన తెల్లవారి జామున 5 గంటలకు పోలీస్ లని పంపి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ అరెస్ట్ లతో మీరు మమ్మల్ని అపగలరేమో గాని ప్రజల పవన్ రావాలి పాలన మారాలి అనే బలమైన స్వరాన్ని మీరు మార్చలేరని పేర్కొన్నారు. పాతపట్నం ఇంచార్జి గేదెల చైతన్య మాట్లాడుతూ వంశధార నిర్వాసితుల 2013 భూ పరిహార చట్టం ప్రకారం ఎందుకు న్యాయం చేయలేదు అని ప్రశ్నించారు. టెక్కలి నియోజక వర్గ ఇంచార్జి కణితి కిరణ్ మాట్లాడుతూ గతంలో టెక్కలి నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా జగన్ గారు హామీ ఇచ్చినట్టు 1108 జీ. ఓ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. రైతులు, గ్రామస్థులు, ఉద్యమ కారులు మీద పెట్టిన కేస్ లు ఎందుకు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర  సృజల స్రవంతి కోసం వచ్చే బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో ఎందుకు చెప్పలేక పోయారు అని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్ మాట్లాడుతూ జిల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ధర్మాన ప్రసాద రావు మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లల కోసం నిర్వహించిన సభలో రాజకీయాలు ఏంటని మండిపడ్డారు. ఉద్దానం సమస్య బయటికి రావడానికి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని మరొక్కసారి గుర్తు చేశారు. అలాగే పాదయాత్ర సమయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేసిన హామీలలో బుడగుట్ల పాలేం ఫిషింగ్ హార్బర్, స్థానికులకు ఉద్యోగాలు నెరవేర్చమని మరొకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఇతరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com