టెక్కలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు పై సన్నాహక సమావేశం
జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ నాయకత్వంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన సదస్సు జరిగింది. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముందుగా నందిగాం మండల జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని మొదట అయిదు నియోజవర్గాలను పైలట్ ప్రాజెక్టుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన నేపద్యంలో దీన్ని టెక్కలి నియోజకవర్గంలో నాయకులు చేపట్టారు. నియోజకవర్గంలోని టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి నాలుగు మండలాల పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాలు ప్రతి రోజు నిర్వహించనున్నట్లు యాదవ్, శ్రీధర్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, సలాసన షణ్ముఖరావు, పసుపురెడ్డి సోమేశ్, హనుమంతు దిలిప్, వాకాడ కృష్ణ, కవిటి షణ్ముఖరావు, నర్సింహా, పవన్ తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు టెక్కలి మండల కార్యకర్తలతో సమావేశం.
పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా కీలకమని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. త్వరలో రాష్ట్రమంతా పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం జరుగనున్న నేపద్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని రెండవరోజు టెక్కలి మండల కార్యకర్తలతో చేపట్టారు. నియోజకవర్గంలోని టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి నాలుగు మండలాల పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాలు ప్రతి రోజు నిర్వహించనున్నట్లు యాదవ్, శ్రీధర్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, పసుపురెడ్డి సోమేశ్, బొడ్డు వీర్రాజు, బొడ్డేపల్లి వెంకటేష్, దారపు కిషోర్ రెడ్డి, వంశీ యాదవ్, పేట సుందర్ రాజేష్, సంజురెడ్డి, లక్ష్మణ్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.