మదనపల్లి ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈనెల 8వ తేదీన అరెస్ట్ అయిన కారణంగా అతను తొందరగా విడుదల అవ్వాలని, అతని ఆరోగ్యం బాగుండాలని మదనపల్లె నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో జనసేన టిడిపి కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన తరపున మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సీనియర్ నాయకులు హరి ప్రసాద్, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గోపాలకృష్ణ, సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, నాగరాజు, పాల్గున, మదనపల్లి జనసేన యువనాయకులు ధరణి, అశోక్ , మహిళా నాయకురాలు మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు హర్ష, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com