నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 187వ రోజున 42వ డివిజన్ మన్సూర్ నగర్ చిరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ముస్లిం మైనారిటీలను నమ్మించి వంచించిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని అన్నారు. దుల్హన్ పథకం నుండి మైనార్టీ కార్పొరేషన్ లోన్ల వరకు అన్యాయం జరిగిందని అన్నారు. ముస్లిం పిల్లలకు ఒడుగులు తీసే కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు. వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉర్దూని రెండో అధిజర భాషగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉర్దూ ట్రాన్సలేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముస్లింలకు మంచి రోజులు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఆ దిశగా అల్లాకి దువా చేయాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.