ఆత్మకూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రిపాడు మండల జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి విచ్చేశారు. కేకు కటింగ్ అనంతరం విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కలిగిరి మండల జనసైనికుడు గురజాల వినయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మండలలో మరిన్నీ సేవా కార్యక్రమాలు నిర్వహించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరూ పోటీ చేసిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, శ్యామ్, హరికృష్ణ, కళ్యాణ్, రమేష్, నిఖిల్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com