న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం సభ్యులు సురేష్ వరికూటి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ హాజరయ్యారు. షేక్ రియాజ్ మాట్లాడుతూ అన్ని దేశాల జనసైనికులు ఒక సమూహంగా ఏర్పడి ఒక సమావేశం నిర్వహించడం గొప్ప ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న సురేష్ వరికూటి మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు పార్టీ కోసం విరాళాలు, ఎన్నికల సమయంలో ప్రచార రథాలు, ఆపదలో ఉన్న జనసైనికులకు ఆర్థిక సహాయం మొదలయిన కార్యక్రమాలు చేస్తుండటం గర్వకారణం అన్నారు. జనసేన పార్టీ నిర్వహించిన ” నా సేన కోసం నా వంతు ” కార్యక్రమంలో పాల్గొని తమ సహకారాన్ని అందించిన ప్రతి జనసైనికునికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను చర్చిస్తూ, జనసేన పార్టీ ద్వారా ఆ సమస్యల మీద జనసేన ఏ విధంగా పోరాటం చేస్తున్నదో తెలియజేశారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా జనసేన పార్టీ చొచ్చుకుపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మఒడి, విద్యాదీవెన పథకం, వివిధ పథకాల గురించి జనసైనికులతో చర్చించి వాటిలోని లోటుపాట్లను తెలియజేశారు. జనసేన పార్టీ ఒక్కసారి అధికారంలోకి వస్తే కళ్యాణ్ గారి ఊపిరి ఉన్నంత వరకూ ఆయనే సీయంగా ఉంటారని అన్నారు. అందుకు కారణం లేకపోలేదని అన్నారు… పవన్ కళ్యాణ్ గారికి డబ్బు మీద ఆశ లేదని, రాజకీయం అంటే ఆయన ఒక సమాజ సేవలా భావిస్తారని అన్నారు. దేశ చరిత్రలోనే మొట్ట మొదటసారిగా ఏ రాజకీయ నాయకుడు తమ స్వంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచి పెట్టలేదని, కేవలం కళ్యాణ్ గారికి ఆ మానవతా దృక్పథం, సమాజం పట్ల ప్రేమ ఏర్పడిందన్నారు. మనకు మీడియా సపోర్టు లేదు… మనకు ఉన్న బలమైన ఆయుధం సోషల్ మీడియా అని అన్నారు. కావున ప్రతి జనసైనికుడు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి పార్టీ అభివృద్ధి కోసం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను రియాజ్ గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు.