ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ రాయపాటి మాట్లాడుతూ అర్ధరాత్రి తప్పతాగి అసభ్యంగా నాతో మాట్లాడిన వైస్సార్సీపీ నేత మీద చర్యలు తీసుకోవాలి అని తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అని అన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా మేయర్ జనసేన పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని అని అంటాం ఎంత ఎవరు సబబు అని, గౌరవ స్థానంలో ఉండి సాటి మహిళకు జరిగిన అన్యాయం మీద స్పందించాల్సిన మేయర్ అలా మాట్లాడటం ద్వారా మహిళ లోకానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అన్నారు. ఈ విషయంలో నాకు నాయ్యం జరిగే వరకు నేను పోరాడతాను అని అలానే ఈ విషయంలో నాకు రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలు మద్దతుగా నిలుస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యులు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, ఉష తన్నీరు, 21 వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, వీర మహిళ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com