ఒంగోలు ( జనస్వరం ) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాలు మేరకు రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో HCM కాలేజ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని రాష్ట్రంలో మహిళల మీద దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని అన్నారు. వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొందిల శ్రీదేవి మాట్లాడుతూ మహిళ హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవటం బాధాకరమని అన్నారు. తక్షణమే బాధ్యత వహిస్తూ హోంమంత్రి సుచరిత గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి గారు మాట్లాడుతూ దిశ శకటాలకి అవార్డులు అందుకుంటున్న సమయంలోనే ఇలా ఒక అమ్మాయి హత్య జరగటం అంత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఆమోదమే పొందని దిశా చట్టం పరిధిలో శిక్షలు ఎలా ఎవ్వరికి అమలు చేస్తున్నారు. ప్రజల్ని మీ ప్రచారం పిచ్చితో కబుర్లు చెప్పి మోసగిస్తున్నారు. 2018 నుండి ఇప్పటివరకు జరిగిన మహిళ హత్యలు, దాడులకి సంబందించిన ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా నిందితులకి శిక్ష పడలేదు అని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయని రమేష్, ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ కళ్యాణ్ ముత్యాల, తెలగం శెట్టి సుబ్బారావు, బండారు సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, ఈదుపల్లి గిరి, ఈదుపల్లి మనీ, చెరుకూరి ఫణి, భూపతి రమేష్, శంకర్, వడ్డీ రాజేష్, పోకల నరేంద్ర, బొందిల మధు, తిరుమల శెట్టి నాని, అవినాష్, నవీన్ పవర్, మాల్యాద్రి నాయుడు, సుభాని వీర మహిళలు ప్రమీల, కోమలి, తోట నాగలక్ష్మి, వాసుకి నాయుడు తదితరులు పాల్గొన్నారు.