ప్రకాశం, (జనస్వరం) : జన సైనికులపై అక్రమంగా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ప్రస్తుత వైసిపి నాయకులు దర్శిలో పెట్టిన పోలీసు కేసును వ్యతిరేకిస్తూ జనసైనికులకు అండగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మీడియా మిత్రులతో దర్శిలో మాట్లాడారు. ఈ సమావేశంలో వరికూటి నాగరాజు మాట్లాడుతూ జనసైనికులపై ఎక్కడైనా సరే అక్రమంగా కేసులు పెడితే ఒప్పుకునేది లేదు అని భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, అలాగే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ద్వారా కావాలని జనసైనికులను టార్గెట్ చేసుకొని కేసును పెట్టారని, వెంటనే దర్శి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రమంతటా నిరసనగలం జనసేన పార్టీ తరఫున వ్యక్తం చేస్తాము అని మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డి.ఈ.ఓ బద్దుల లక్ష్మయ్య, గణప శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి ఆకుల జగదీష్, దర్శి జనసేన పార్టీ నాయకులు షేక్ ఇర్షాద్, ఉప్పు హర్ష, యర్రంశెట్టి చిరంజీవి, సందు కోటి, నీలిశెట్టి ప్రభు, పుప్పాల వసంత్, పెండ్లి బద్రి, దర్శి నియోజకవర్గ జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com