Logo
Date of Publish : 26 August 2021, 3:46 pm
Editor : Sake Naresh

టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్బంగా విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా జనసేన నాయకులు

       ప్రకాశం,  (జనస్వరం) :   ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచన మేరకు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్బంగా  ఒంగోలు లోని లాయర్ పేట రైతు బజార్ ఎదురు గల ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా సీనియర్ జనసేన నాయకులు వల్లంశెట్టి ఆంజనేయులు గారు మాట్లాడుతూ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళ్ళు అర్పించడం జరిగింది అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం పంతులు గారి స్ఫూర్తి తో ముందుకు వెళ్తాము అని అన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మీడియా ఇంఛార్జ్ కళ్యాణ్ ముత్యాల గారు మాట్లాడుతూ ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్బంగా నివాళ్ళు అర్పించడం జరిగింది అని అన్నారు. మహనీయుడు ప్రకాశం పంతులు గారు చూపిన బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సారథ్యంలో రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడతం అని తెలియజేసారు.  ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి గారు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయులు చూపిన బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సారథ్యంలో మహిళా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి రాయని రమేష్, నరహరి సాంబయ్య, బండారు సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, మోహన్, చంగల శెట్టి సుధాకర్, ఈదుపల్లి గిరి, భూపతి రమేష్, మధు బొందిల, శ్రీనివాస్ పెర్నమిట్ట, ఇర్ఫాన్, అవినాష్ నాయుడు, చిన్న రాజా, నాగరాజు, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com