ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచన మేరకు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్బంగా ఒంగోలు లోని లాయర్ పేట రైతు బజార్ ఎదురు గల ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా సీనియర్ జనసేన నాయకులు వల్లంశెట్టి ఆంజనేయులు గారు మాట్లాడుతూ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళ్ళు అర్పించడం జరిగింది అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం పంతులు గారి స్ఫూర్తి తో ముందుకు వెళ్తాము అని అన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మీడియా ఇంఛార్జ్ కళ్యాణ్ ముత్యాల గారు మాట్లాడుతూ ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్బంగా నివాళ్ళు అర్పించడం జరిగింది అని అన్నారు. మహనీయుడు ప్రకాశం పంతులు గారు చూపిన బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సారథ్యంలో రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడతం అని తెలియజేసారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి గారు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయులు చూపిన బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సారథ్యంలో మహిళా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి రాయని రమేష్, నరహరి సాంబయ్య, బండారు సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, మోహన్, చంగల శెట్టి సుధాకర్, ఈదుపల్లి గిరి, భూపతి రమేష్, మధు బొందిల, శ్రీనివాస్ పెర్నమిట్ట, ఇర్ఫాన్, అవినాష్ నాయుడు, చిన్న రాజా, నాగరాజు, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు.