ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళ ఆత్మీయ సమావేశం కృష్ణ- పెన్నా వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ మహిళలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ, అందుకే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వీరమహిళ విభాగాన్ని స్థాపించారు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చిన ఆంధ్ర ప్రజలు లబోదిబోమంటున్నారు. అలాంటి ఈ సమయంలో సమస్యల మీద వీర మహిళల పోరాట స్ఫూర్తి అద్వితీయమని అన్నారు. పార్టీని ప్రజల్లోకి మీరే రాబోవు రోజుల్లో బలంగా తీసుకొని వెళ్ళాలి. మీకు పార్టీ అండ దండగా ఉంటుంది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క వీర మహిళకు తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ జెండాను గ్రామ గ్రామాన వీర మహిళలు ఎగిరేలా చూడాలి. పవన్ కళ్యాణ్ ఆశయాలను నచ్చి ఆయన మీద అభిమానంతో పనిచేసే మీలాంటి వీర మహిళలు ఉండటం ఎంతో సంతోషదాయకం. మీరందరూ ఐక్యతతో ముందుకు వెళ్లి 2024 లో పవన్ కళ్యాణ్ ని ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి అని మీకు ఎల్లవేళలా మేమందరం అండగా ఉంటామని రాష్ట్ర కార్యవర్గం తరఫున తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే కృష్ణ- పెన్నా వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడమే మా వీర మహిళల ముఖ్య ఆశయం అని, జిల్లాలో షేక్ రియాజ్ సారధ్యంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని, మహిళలకు భద్రత ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో కలిపి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మేము సైతం ఒక అడుగు వేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా, దర్శి ఇంచార్జ్ బోటుకు రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, కృష్ణ పెన్నా కమిటీ సభ్యులు రావి సౌజన్య, కోలా విజయలక్ష్మి , పార్వతి నాయుడు, మల్లెపూ విజయలక్ష్మి, ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, శివ పార్వతి,షేక్ ముంతాజ్, అన్నపూర్ణమ్మ, ఈదుపల్లి నాగేంద్రం, పిల్లి వైష్ణవి, వనజ బత్తుల, నాగేంద్రం, అయినా బత్తిన రాధిక, పోలిశెట్టి మాధురి, బడుగు శ్రీవిద్య, భాగ్యలక్ష్మి, గుండాల భారతి, ఇదరి చంద్రిక, రాయని నాగవర్థిని, తదితరులు పాల్గొన్నారు.