Logo
Date of Publish : 29 September 2022, 1:50 pm
Editor : Sake Naresh

పేదోడి, కార్మికుల, కూలీల, ఉసురు తగలడం ఖాయం : జనసేన నాయకులు

           విజయనగరం ( జనస్వరం ) : జనంలోకి జనసేన కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) గురువారం కంటోన్మెంట్ గణేష్ కోవెల కూడలిలో నిర్వచించారు. ముందుగా భవన నిర్మాణ కార్మికులకు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజలపక్షాన నిలబడి చేస్తున్న ప్రజాసేవ వివరాలతో కూడిన కరపత్రాలు, జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలతో కూడియున్న కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఒక్క అవకాశం అని జగన్ రెడ్డి అందలమెక్కి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజానీకానికి రోడ్డున పడేసారాని, ఆఖరికి కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక, ఉత్తరాంధ్ర నుంచి పొరుగురాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని, ఖచ్చితంగా రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుందని దుయ్యబట్టారు. గతప్రభుత్వాల పనితీరును చూసారు గనుక, ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రకలపక్షాన నిలబడి అన్నివిధాల సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, పార్టీ యువ నాయకులు లోపింటి కళ్యాణ్, సీరకుమార్, పత్రి సాయి, బంగార్రాజు, భాస్కర రావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com