
విజయవాడ, (జనస్వరం) : భవానిపురం స్వాతి థియేటర్ వద్ద “మై బేబీ” ఫోటోగ్రఫీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఆఫీస్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజులు నిండిన చిన్నారులకు ప్రత్యేకంగా ఫోటోలు తీసి వారి తల్లిదండ్రుల జీవితంలో ప్రత్యేక జ్ఞాపకంగా ఉంచుకొని గొప్ప అనుభూతిని పొందేలా ఏర్పాటు చేశారని, నగరంలోని రోజులు నిండిన చిన్నారులకు ఫోటో స్టూడియో మొట్టమొదటిదని, యజమాని రాపర్తి యశ్వంత్ పద్మాకర్ మంచి వృద్ధిలోనికి రావాలని ప్రజలు వినూత్నంగా ఏర్పాటుచేసిన ఈ స్టూడియోని తప్పక ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శనివారం శివ, కొర్ర గంజి వెంకటరమణ, శీన నాయకులు స్టాలిన్, దాసిన జగదీష్, బావి శెట్టి శ్రీను, పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు.