– రాజకీయాలు మాని నిందితుడికి శిక్ష పడే దారి చూడాలి
– తొమ్మిదో తరగతి విద్యార్థిని వేధింపులు తాళలేక బలవన్మరం చేసుకోవడం అత్యంత బాధాకరం.
– ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి.
– దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడాలి..
– మహిళలను వేధించిన మృగాళ్ల శిక్షించడంలో ప్రభుత్వం అనేక సార్లు వైఫల్యం చెందింది.
– వైసీపీ ప్రభుత్వం మాటలకే పరిమితం, ప్రచార ఆర్భాటం తప్ప మహిళలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు.
– ఇప్పటికైనా రాజకీయలు మాని నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూడాలి.
విజయవాడ, (జనస్వరం) : దీక్షిత కుటుంబ సభ్యులను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్బంగా మరణించిన దీక్షిత తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతమన్నారు. అధ్యాపకురాలు అయినా దీక్షిత తల్లి తన కూతుర్ని కాపాడుకోలేక పోయానని ఇలాంటి కష్టం దారుణం మరెవ్వరికీ జరగకూడదని, వినోద్ జైన్ కు కఠిన శిక్ష పడే అంతవరకూ పోరాడాలని అందుకు అండగా నిలబడాలని మహేష్ కు తెలియజేశారు. రాజకీయాలు మాని నిందితుడికి శిక్ష పడే దారి చూడాలని ఆయన కోరారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని వేధింపులు తాళలేక బలవన్మరం చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు. మహిళలను వేధించిన మృగాళ్ల శిక్షించడంలో ప్రభుత్వం అనేక సార్లు వైఫల్యం చెందిందని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మాటలకే పరిమితమని, ప్రచార ఆర్భాటం తప్ప మహిళలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాజకీయలు మాని నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.