విజయవాడ, (జనస్వరం) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుమార్తెపై అత్యాచారయత్నం మానవ మృగం హాఫిజ్ మస్తాన్ చేతిలో అత్యాచారాయత్నానికి గురైన పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నపిల్లను పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పరామర్శించారు. చిన్న పిల్ల తల్లిదండ్రులును షేక్ చాంద్ భాషతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అత్యాచారయత్నం జరిగిందని, చాంద్ బాషా వైసీపీకి చెందిన వాడిని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఫోన్ చేసిన స్పందించలేదని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గడపగడపకి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుతో తిరిగానని, తన కష్టం తెలిసిన కనీసం స్పందించలేదని, తన ఆవేదనను జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ముందు వెలిబుచ్చారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సయ్యద్ మోబినా, సయ్యద్.షాహీనా తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com