• అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ను ఎందుకు వినియోగంలో తీసుకురాలేదు?
• ఇంటింటికి మన ప్రభుత్వం అంటూ తిరుగుతున్న మీరు అసలు ఏ సమస్యలు చూశారు ఏ సమస్యలు పరిష్కరించారో సమాధానం చెప్పాలి వెల్లంపల్లి శ్రీనివాసరావు కి దమ్ముంటే నాతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రావాలి
• మేయర్ గారు వెల్లంపల్లి శ్రీనివాసు అవినీతి గురించి సీఎం గారికి బహిరంగ లేఖ రాశా ఆ లేఖ మీద మీరు ఎందుకు స్పందించలేదు ?
విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 52 వ రోజు 45 డివిజన్ జనసేన అధ్యక్షుడు బొమ్ము రాంబాబు ఆధ్వర్యంలో సొరంగం వద్ద, గేదెల రాజు గారి ఇంటి ఎదురు సందు వద్ద నుండి ప్రారంబించి RR నగర్, రామకోటయ్య వారి వీధి, కొండ పై ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కొండ ప్రాంతంలో పర్యటిస్తే అడుగడుగునా ప్రజలు సమస్యలే చెప్తున్నారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎందుకని ఇంకా వినియోగంలో తీసుకురాలేదని అలా తీసుకురాకపోవడం వల్ల కొండపై ప్రాంతం నుంచి కింద వరకు కూడా మురుగునీరు డ్రైనేజీలో కాకుండా బయటకి పొంగి ఇళ్ల చుట్టుప్రక్కలంతా కూడా దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికి మన ప్రభుత్వం అంటూ తిరుగుతున్న మీరు అసలు ఏ సమస్యలు చూశారో ఏ సమస్యలు పరిష్కరించారో సమాధానం చెప్పాలని, లేక వెల్లంపల్లి శ్రీనివాసరావు కి దమ్ముంటే నాతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రావాలని అన్నారు. మేము ఎక్కడైనా సరే రెండు మాటలు ఎక్కువ మాట్లాడిన మీరు మా మీద ఒత్తి పుణ్యానికి కేసులు పెడుతున్నారని, కొండ బడి ఎదురు సందులో గాని, వినాయకుడి గుడి పక్క సందులో త్రాగునీరు నాలుగైదు నెలల నుండి రంగు మారి వస్తున్నాయని అన్నారు. నీటిలో పురుగులు కూడా వస్తున్నాయని, ఈ నీరు త్రాగి ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానిక మహిళలు చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, స్థానిక సమస్యలు పరిష్కరించడానికి పార్టీ మారినటువంటి స్థానిక కార్పొరేటర్ స్థానిక సమస్యలు పరిష్కరించక పోగా పార్టీ మారినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని అన్నారు. కింద ప్రాంతాల్లో మాత్రం విస్తృతంగా తిరిగి కొత్త బిల్డింగ్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అయితే తిరుగుతున్నారని, కనిపించినప్పుడు మాత్రం ఒక నవ్వు నవ్వుతున్నారని, సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, కొండ ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ లేవని రిటైనింగ్ వాళ్ళు కట్టలేదని అన్నారు. చాలా చోట్ల నడవడానికి దారి కూడా లేదని, కరెంట్ బిల్లు కూడా విపరీతంగా వస్తున్నాయి చాలామంది చెప్తున్నారని ఒక బల్బు ఉన్న ఇంటికి కరెంట్ బిల్లు 250 నుంచి 300 రూపాయలు వస్తుందని గతంలో 300 కరెంట్ బిల్లు వచ్చే ఇంటికి ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుందని, పన్నుపోట్లయితే అసలు చెప్పనవసరం లేదని 60 గజాల ఇంటికి 120 గజాల బిల్లు వస్తుందని ఈ సమస్యల మీద మాట్లాడకుండా ఎంతసేపు జనసేన వాళ్ల మీద విమర్శలు చేస్తున్నారని ఈ రాష్ట్రంలో సీఎం గో బ్యాక్ అని చెప్పిన ఒకే ఒక నియోజకవర్గ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం మని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మీరు అభివృద్ధి చేయలేదని అందుకనే మిమ్మల్ని గో బ్యాక్ అన్నామని చెప్పామని కానీ ఆయన ఎక్కడా కూడా పశ్చిమనియోజక వర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేదని కొండ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించామని ఎక్కడైనా మాట్లాడతారు అనుకుంటే మాట్లాడలేదని అన్నారు.
రాజరాజేశ్వరి పేట ఇళ్ల పట్టాల గురించి గానీ, షేక్ రాజ హోస్పటల్ గురించి గానీ మాట్లాడలేదని, వేలంపల్లి శ్రీనివాసరావుకి అభివృద్ధి గురించి తెలియదని ఆయనకి అవినీతి గురించి బాగా తెలుసని అందుకనే రెండు మూడు సమస్యలు నేను చెప్పినవే వెల్లంపల్లి శ్రీనివాసరావు కాపీ కొట్టి నేను మాట్లాడిన సమస్యలే మాట్లాడి సీఎం ముందు బిల్డప్ బాబాయ్ వేషాలు వేశారని ఆయన దగ్గర ఉండే ఇద్దరు ముగ్గురు శిఖండి గాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని మీరందరూ కూడా ఎక్కడి నుంచి పోయారు గుర్తుపెట్టుకోవాలని టైం వచ్చినప్పుడు మీ సంగతి చెప్తానని, మేయర్ గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారని నేను లేవనెత్తిన ప్రతి సమస్యకు ఆమె సమాధానం చెప్పారని అన్నారు. అది మంచిదే కానీ మీరు అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నామని, మీరు వేగంగా స్పందిస్తే అభివృద్ధి కూడా వేగంగా జరిగేదని, కానీ మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదని, మీరు కూడా అవినీతి మీద దృష్టి పెట్టారని మీరు కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఎలా ఉన్నారో ఎన్నికల తర్వాత ఎలా ఉన్నారో సమాధానం చెప్పాలని అన్నారు. మీ బినామీ కాంట్రాక్టులు గురించి మీ పార్కింగ్ కాంట్రాక్టుల గురించి చెప్పాలని, మీ అక్రమ నిర్మాణాలు గురించి కూడా చెప్పాలని, కావాలంటే ఏజెంట్ల పేర్లు కూడా చెప్తామని, మీరు స్పందించాల్సిన అంశం ఏంటంటే నేను వెల్లంపల్లి శ్రీనివాసు యొక్క అవినీతి గురించి సీఎం గారికి బహిరంగ లేఖ రాశానని ఆ లేఖ మీద మీరు ఎందుకు స్పందించలేదని వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి మీద నేను రాసిన బహిరంగ లేఖ మీద మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని దీనికి మీరు సమాధానం చెప్పాలని అన్నారు. 45 డివిజన్ జనసేన అధ్యక్షుడు బొమ్ము రాంబాబు మాట్లాడుతూ ఈ డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు. నీటి కాలుష్యము వలన అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పలితం లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మ గోవింద్ లక్ష్మి, శనివారపు శివ, క్రిష్, కూర్మా రావు, రాము గుప్తా, తమ్మిన లీలా కరుణాకర్, రెడ్డిపల్లి గంగాధర్,గన్ను శంకర్, గంజి పవన్, శ్రీను బంటుమిల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com