Logo
Date of Publish : 13 February 2023, 7:46 am
Editor : Sake Naresh

బీసీలకు పదవి ఒకటే కాదు – సంపూర్ణ అధికారం వచ్చే వరకు పోరాడుతాం : గుంటూరు జిల్లా జనసేన నాయకులు

     గుంటూరు, (జనస్వరం) : గుంటూరులో నిర్వహించిన బిపి మండల్ గారి విగ్రహ ఆవిష్కరణ మరియు బీసీల ఆత్మగౌరవ సభకు పార్టీలకు అతీతంగా బీసీ సంఘాల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు హాజరు అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తుందని, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గానీ పేరుకే బీసీలకు పదవులు ఇచ్చి అధికారం ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తుందని, ఈ ప్రభుత్వాలు చేస్తున్న పనులపై చిల్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. అలాగే రానున్న రోజుల్లో బీసీలకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని, రిజర్వేషన్ల కోసం సమిష్టిగా పోరాడతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అధికార పార్టీని వివిధ కార్యక్రమాల్లో బీసీ గొంతులను నొక్కేస్తున్న వైన్యం చూస్తున్నాము. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని గట్టిగా నమ్మి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకుంటే బీసీలకు న్యాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రంలో ఉన్న బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com