
-వారానికోసారి నాన్-వెజ్ వండుకోవడం కూడా కష్టంగా మారింది
-ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు పోత్సాహం లేదు, దీంతో దిగుబడి తగ్గింది
-మార్కెట్ లో చికెన్, మటన్ ధరలు ఆకాశానికి చేరాయి
-కూరగాయలు, నిత్యావసరాల ధరలదీ అదే తీరు
-ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 28వ రోజున స్థానిక 4వ డివిజన్ మైపాడు రోడ్డు సెంటర్ శ్రీనివాసనగర్ 4వ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరల స్థిరీకరణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పథకాల పేరుతో మళ్లిస్తున్నారని, అది కూడా చాలక ప్రతి వారం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ, ఆక్వా, పౌల్ట్రీ, పశు ఆధారిత రంగాలకు ఈ ప్రభుత్వం నుండి కనీస ప్రోత్సాహం కూడా లేదని దుయ్యబట్టారు. కేజీ చికెన్ ధర గతంలో ఎంత ఇప్పుడు ఎంత అని పలువురు మహిళలను అడిగితే గతంలో 150 రూపాయలు ఉండగా ఇప్పుడు 320 రూపాయలు అని చెప్పారన్నారు. అదే కేజీ మటన్ గతంలో 600 రూపాయలు ఉండగా ఇప్పుడు 1000 రూపాయలు అయిందని తెలిపారన్నారు. చేపలది కూడా అదే తీరని తెలిపారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ ధరలు రెట్టింపు అయ్యాయని కేతంరెడ్డి వివరించారు. ఆఖరికి కూరగాయల ధరలు కూడా గతంతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉందని, ఈ వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలు సరైన పోషకాహారాన్ని కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారని వివరించారు. నెల్లూరులో ప్రజలకు ప్రతి ఆదివారం నాన్-వెజ్ వండుకునే అలవాటు ఉందని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరల వల్ల వారానికో రోజు కూడా వండుకుని తినలేకపోతున్నారని వివరించారు. వ్యవసాయ, ఆక్వా, పౌల్ట్రీ, పశు ఆధారిత పరిశ్రమలకు సరైన ప్రోత్సాహకాలు అందించి దిగుబడిని పెంచే మార్గాలు అన్వేషిస్తే తప్పించి ఈ పరిస్థితిలో మార్పు రాదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు వివరించారు. సంబంధిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదని, పథకాలకు, ఉద్యోగుల జీతాలకు అప్పులు వెతుక్కునే స్థితిలోనే ఉందని కేతంరెడ్డి ఎద్దేవా చేసారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే, ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉండాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి పరిపాలన వల్లే సాధ్యమని, ప్రజలందరూ జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.