విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల తో రాజకీయం చేస్తూ ఓట్ల రాబట్టుకోవడం కోసం విద్యార్థులతో జగన్ మోహన్ రెడ్డి గారు చెలగాటమాడుతున్నారని అన్నారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద సుమారుగా నాలుగు దఫాలకి కింద 5000 కోట్ల రూపాయలు బకాయిలు వున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం వల్ల విద్యార్థులకి కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వక తిప్పుతా ఉంటే ఆ విద్యార్థులు ఏం చేయాలో పాలు పోక తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక వడ్డీలకు అప్పు చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారన్నారు. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి చిన్నపాటి బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కళాశాల యొక్క ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకునే దుస్థితికి రావడానికి కారణనం జగన్ మోహన్ రెడ్డి గారు కాదా అని ? ధ్వజమెత్తారు. విద్యాధీవెన, వసతి దీవెనకు సంబంధించిన నాలుగు దఫాల యొక్క బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని దీనికి సమాధానం చెప్పాలని, 450 కోట్ల రూపాయల ఫీజురీమెబర్స్మెంట్ ని చెల్లించమని కళాశాల యాజమాన్యంలను మీరు బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. కళాశాలకు ఉండేటువంటి బకాయిలను కేవలం 75% మాత్రమె చెల్లిస్తామని అందుకు మీరు అంగీకరించకపోతే మీ మీద ఏదో రకమైన దాడులు చేసి ఇబ్బడులుకు గురి చేస్తామని కళాశాల యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ కళాశాల యాజమాన్యాలతో, ఇటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది జగన్ గారిని , రాష్ట్రంలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉండేదని ఇప్పుడు దాన్ని ఎందుకు రద్దు చేశారని దీనివలన ఈ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది బీసి, ఎస్టి ఎస్సి ,మైనార్టీ మరియు అగ్రవర్ణ పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైనా మాట వాస్తవం కాదని, అదేవిధంగా జగనన్న విద్యాదేవన వసతి దీవెన పదకాల యొక్క కేవలం సాక్షి లో ప్రకటనల కోసమే 125కోట్ల నుడి 150కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా అని? అంటే కేవలం ఈ పథకాల ప్రకటనల ద్వారా భారతీ గారికి 150 కోట్లు కట్టబెట్టిన మాట నిజం కాదా అని అన్నారు. ప్రకటనల కోసం ఖర్చుపెట్టిన ఈ ధనాన్ని పేద విద్యార్థుల కోసం కేటాయించి ఉంటే కొన్ని వేల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే వారు కదా అని, నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు విద్యార్ధులుకు మీరు ఎంతైనా ఉన్నత చదువులు చదవండి నేను ఫీజులు చెల్లిస్తానని చెప్తున్నాడని విద్యా దీవెన వసతి దీవెన కింద 5000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న వీరు వారికి ఫీజులు ఏం చెల్లిస్తారని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం యొక్క బకాయిల గురించి మాట్లాడే మీరు మీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల గురించి ఎందుకు మాట్లాడరని మీరు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు సంవత్సరం చివర్లో హాల్ టికెట్లు ఇవ్వడం లేదని పరీక్షలు అయినంతరం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తదుపరి చదువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై ఇంతవరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి అవకాశం లేక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కాక ఈ సంవత్సరం సుమారు 60వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు తెలంగాణకు వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా ?? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అని ఈ రాష్ట్రాన్ని గంజాయి మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు కేంద్ర బిందువుగా మార్చి యువతకి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసినది మీరు కాదా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు పరిశ్రమలు ఉన్నాయా, ఉద్యోగ అవకాశాలు ఉపాధి ఉన్నాయా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడిపోతున్నారని అన్నారు. వారికి ఉద్యోగాలు రాక స్థిరత్వం లేక వారు పెళ్ళికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారంటే ఆ దుర్మార్గమైన పరిపాలన విధానం మీది కాదా అని ఈ రాష్ట్రంలో విద్యార్థులు బాగా చదువుకుని చదువు పూర్తి చేసిన తర్వాత వార్కి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఈ రాష్ట్రంలో కనీసం ఒక వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సత్య , నాదెల్లా రావాలని అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.