అనంత జనసైనికులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా లో గత కొన్ని రోజులుగా కరోనా వ్యాధి ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి మెమోరాండం ఇవ్వబోతున్న జనసైనికులను అక్రమంగా అరెస్టు చేయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్య పరిస్థితి మెరుగుపరచమంటే అక్రమ అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పొదిలిబాబురావు, A.ఈశ్వర్, జక్కి రెడ్డి ఆదినారాయణ మరియు నాయకులు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రశ్నిస్తున్న జనసేన గొంతును నొక్కడం సరికాదని జనసేన నాయకులు అన్నారు. రాష్ట్రంలో రోజుకి కరోనా పాజిటివ్ 10 వేలకు పైగా నమోదు అవుతున్నా కూడా తగిన చర్యలు లేవు. ప్రశ్నిస్తున్న జనాలను ఇలా అరెస్ట్ చేయడం భావ్యం కాదని హెచ్చరించారు. ప్రజల మీద, అనంతపురం జిల్లా మీద మీకు అంత చిత్త శుద్ధి ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సవాలు చేశారు.