అరకు, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో విద్యార్థుల, విద్యార్థినులు వారి సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపడుతుంటే, వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని, దీనికై జనసేన పార్టీ విశాఖ మన్యం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. అనంతపురంలో SSBN ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థుల విద్యార్థినులపై అమానుషంగా విచక్షణారయితంగా కొడుతూనే, లాఠీఛార్జి చేస్తూ మహిళ పోలీస్ లేకుండానే మహిళలపై దాడులు చేయించడం రాష్ట్ర ప్రభుత్వం అహంకారానికి ఇది నిదర్శనం అని, ఇటువంటి ధోరణి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ తీరును మార్చుకోవాలని, లేని ఎడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com