తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటిలో భోగి రోజు రాత్రి వేళ పోలీసులు తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామికం. సంక్రాంతి పర్వదిన సమయంలో, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు మా పార్టీ నాయకుడి ఇంటిపైకి తనిఖీలకు వెళ్లడంపై పోలీసు శాఖ సమాధానం ఇవ్వాలి. ఈ విషయం తెలియగానే శ్రీ శ్రీనివాస్ గారితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. తనిఖీల పేరిట హడావిడి చేయడం, అక్కడి పోలీసు చర్యలను వీడియోల ద్వారా ఉన్నతాధికారులకు చూపించడం గురించి ఆయన వివరంగా తెలియచేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసు శాఖ ఈ విధమైన చర్యలకు పాల్పడిందని అర్థం అవుతోంది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలో నాయకుడిగా ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే- అధికార పక్షం ఈ విధమైన అప్రజాస్వామిక రీతిలో బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది ఫ్యాక్షనిస్ట్ తరహా రాజకీయమే. శ్రీ శ్రీనివాస్ గారి ఇంటిపై చోటు చేసుకున్న ఈ చర్యలపై పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చర్చించారు. ఈ విషయంలో శ్రీ శ్రీనివాస్ గారికి పార్టీ ధైర్యం చెబుతుంది.. అండగా నిలుస్తుంది అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com