జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసులు గారి ఇంటి పై రాత్రి11:30 నిమిషములకు పోలీస్ శాఖ, సరైన కారణాలు లేకుండా మరియు సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించడం ఆక్షేపణీయం అని రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోలో వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రశ్నించే జనసేన పార్టీ నాయకుల గొంతులు నొక్కే యాలని ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని తెలుపుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ప్రజాపోరాటాలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండుగ వేళల్లో, రాత్రి సమయాలలో ఇలాంటి సోదాలు నిర్వహించిన పోలీసు శాఖ వారిపై కోర్టు ద్వారా చట్టబద్ధ చర్యలుంటాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ విభాగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నదని ఈ సంఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని మరియు ప్రభుత్వ శాఖలు జనసేన పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ముందు సరేనా కారణాలతో ముందుకు రావాలని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com