ప్రకాశం ( జనస్వరం ) : పర్చూరు జనసేన నాయకులు మాదాసు మురళీ మాట్లాడుతూ జనసేన పార్టీ కౌలు రైతుల కన్నీటి వేదన తెలుసుకొని 19 వ తేదీ పర్చూరులో రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సభ ఏర్పాటు చేస్తే ఆ సభకు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ నాతో పాటు కార్యకర్తలు సిద్ధం అవుతున్న తరుణంలో నేను ఊరిలో లేను అని ఫోన్ చేసింటే పోలీసులకు తెలిపిన కూడా పోలీసులు మా ఇంటికి వచ్చి ఇంట్లో మహిళలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సభకి వెళ్ళనివ్వకుండా చూడాలని లేనిచో ఇబ్బందులు ఎదుర్కొంతాదాన్ భయపెట్టడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని పేర్కొన్నారు. పర్చూరులో జరిగే సభకు సి.ఎం జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికామని, రైతులను అవహేళనగా మాట్లాడం సరికాదన్నారు. ఒకసారి వచ్చి చూస్తే ఆ కౌలు రైతులు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుస్తుందన్నారు. జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను కార్యక్రమంనకు పోకుండా ఆడ్డుకోవాలని ఆలోచించిన సమయంలో కనీసం 10% కౌలు రైతుల సమస్యలపై దృష్టి పెట్టిన వారు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కౌలు రైతుల, ప్రజాసమస్యలను పరిష్కరించక పోతే ఎటువంటి పోరాడటాలు చేయడానికైనా జనసేన పార్టీ కార్యకర్తలు వెనుకడబోరని హెచ్చరించారు.