-టిడ్కో అపార్టుమెంట్లను ఖాళీగా ఉంచడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి
-మహిళలకు భద్రత కరువైంది
-వైసీపీ ప్రభుత్వం వీరికి మంచి నీళ్ళు ఇవ్వట్లేదు, మురుగు తీయట్లేదు
-కార్పొరేషన్ తక్షణం సదుపాయాలు కల్పించాలి
-టిడ్కో గృహస్తుల వెతలపై జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జగనన్న కాలనీల పరిస్థితి, టిడ్కో ఇళ్ళ వద్ద వసతులను జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మూడో రోజున పరిశీలించారు. ఇక్కడ అధ్వాన్న పరిస్థితులను, మహిళల భద్రతా అంశాలను గమనించిన ఆయన ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 182వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 54వ డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో అపార్టుమెంట్లలో సుమారు 5వేల కుటుంబాలకు పైగా కాపురం ఉండాల్సి ఉండగా ఈ వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారన్నారు. లోన్ అవసరం లేదంటూ కేటాయించిన ఇళ్ళలో ఇక్కడ సుమారు 200 కుటుంబాల వరకు నివసిస్తున్నారని, వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కేతంరెడ్డి తెలిపారు. ఈ కుటుంబాలకు నీరు సదుపాయం కల్పించలేదని, మురుగు తీయట్లేదని దీంతో తీవ్ర అవస్థులు పడుతున్నారని అన్నారు. రాత్రుళ్ళు వీధి లైట్లు కూడా ఇక్కడ లేవని, చీకట్లో ఖాళీగా ఉన్న గృహాలు అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారాయని అన్నారు. పగటి పూట కూడా మద్యం త్రాగే వారు, జూదరులు ఈ నివాసాలను అడ్డాగా మార్చుకున్నారని, పోలీసు పర్యవేక్షణ లేదని, మహిళలు భద్రంగా బ్రతలేకపోతున్నారని, ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com