తిరుపతి ( జనస్వరం ) : పోలీసులు వైసిపిని కాకుండా ఐపిసిని ఫాలో అవ్వాలన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. వైజాగ్ లో టైకూన్ జంక్షన్ ను మూసివేయడం పై పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాంతియుత ఆందోళన చేస్తుంటే అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు వైసిపి డ్రెస్ మాత్రమే వేస్కోలేదన్నారు. తెలంగాణా ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా వుందో అందరూ చూశారన్నారు. వైసిపీ దోపిడీని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. వైసిపి నాయకులు ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ఏనాడు నోరు విప్పలేదన్నారు. మంత్రులకు వాళ్ల శాఖలపై కూడా పట్టులేదన్నారు. ప్రజలు వైసిపి వ్యతిరేఖ ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. వైసిపి నాయకులతో పాటు, రాజ్యాంగబద్దంగా ప్రవర్తించని వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. వడ్డీతో సహా తిరిగి ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టే డిమాండ్ లు వ్యక్తిగతంగా ఉండవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎందాకైనా వెళతారన్నారు. రాష్ట్రాన్ని గెలిపించాలని పవన్ కళ్యాణ్ తపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జి కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షులు రాజా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి దేవర మనోహర్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, కొండా రాజ మోహన్, తిరుపతి ప్రధాన కార్యదర్శి దినేష్ జైన్, రాజేష్ ఆచారి, నగర కమిటీ సభ్యులు మనోజ్ కుమార్, హిమవంతు, రమేష్, రుద్ర కిషోర్ రెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.