పోలవరం – శ్రీ సత్యసాయి డ్రికింగ్ ప్రాజెక్టులో వర్కర్స్ జీతాలు ఇవ్వలేదని చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతు, డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వానికి వినతి

పోలవరం

         పోలవరం ( జనస్వరం ) : శ్రీ సత్యసాయి డ్రికింగ్ ప్రాజెక్టులో 2005 సం.రంలో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏజెన్సీ మెట్ట ప్రాంతం ప్రజలకు గోదావరి జలాలు త్రాగునీరుగా అందించేందుకు ఈ పథకం నిర్మించారు.. ఈ పథకం నిర్వాహణ భాధ్యత ప్రభుత్వమునకు అప్పగించారు. ప్రభుత్వం 2007 సం.రంలో ఎల్ & టి  లిమిటెడ్ కంపెనీ వారికి మెయింటెన్స్ బాధ్యత అప్పగించారు. ఎల్ & టి  వారికి మెయింట్‌నెన్స్‌ చార్టీలు నిమిత్తం ప్రతీ నెల మమారు 60 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ పధకం ద్వారా 17 మండలాల్లో సుమారు 200 గ్రామాలకు, సుమారు 5 లక్షల జనాభాకు రోజూ సుమారు 2 కోట్ల లీటర్ల మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ పధకం నందు వివిధ గ్రేడులలో సుమారు 165 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో పనిచేసే కార్మికులకు చాలీ చాలని జీతములతో కోవిడ్19 కాలములో కూడా తమ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు అందించినారు. కానీ మాకు గత 8 నెలలుగా జీతాలు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం నిర్వహణ చూస్తున్న ఎల్ & టి కంపెనీ వారు తమకు రావలసిన మెయింటెన్స్ బిల్లులు రాకపోవడం వలన వారు 16 జూన్ 2021 తేదీ నుండి సదరు కంపెనీ వారు వారి నిర్వహణ బాధ్యతను వదిలి వెళ్ళిపోయారు. కానీ కార్మికులకు జీతాలు ఇచ్చేవారు లేరు. మా సమస్యను పట్టించుకునే వారు లేరు. దిక్కు తోచని పరిస్థితుల్లో మా కార్మికులందరూ 02.08.2021 తేదీ నుండి సమ్మె చేయుట జరుగుతున్నది. కార్మికులందరినీ స్కిల్డ్ వర్కర్స్ గా గుర్తించి జీ.ఓ. ఎం.ఎస్.నెం.11 ప్రకారం స్కిల్ల్డ్ జీతాలు చెల్లించాలి అని కోరుతున్నారు. అలాగే యూ పథకములో పని చేస్తూ వివిధ కారణాల రీత్యా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదు. జీతాలు లేక మా కుటుంబాలు పోషించుకొనుట చాలా కష్టతరముగా ఉంటున్నది.  ఇదే వృత్తి తప్ప వేరే జీవనాధారము ఏమి లేవు.  సమ్మె మొదలు పెట్టి 75 రోజులు అయినప్పటికీ ఒక్కరు కూడా మమ్ములను పట్టించుకోవడం లేదని జనసేన తరుపున గెలిచిన వార్డు మెంబర్ పోతుల దుర్గ ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సమ్మె దృష్ట్యా ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. సమస్యలు వెంటనే పరిష్కరించి మాకు రావాల్సిన 10 నెలల జీతాలు ఇప్పించి మా కుటుంబాలు ఆదుకోవలసినదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొనగల సురేష్, పెద్దేవం జవ్వాది మణి, గజ్జరం అవుడు సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way