శ్రీకాకుళం ( జనస్వరం ) : రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో కెల్లవీది దగ్గర కుళాయి నీరు ఏమార్గం ద్వారా వెల్లాలో తెలియని పరిస్థితిలో ఉంది. కుళాయి నీరు ఎవరికి పనికి రాకుండా వృధా అవుతుంది. ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏమౌతున్నాయో తెలియదు కాని కృష్ణాపురం ప్రజలు కాలువలు లేక మురియ నీరుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు పొట్నూరు లక్ష్ము నాయుడు అన్నారు. నీరు అక్కడ అక్కడే నిల్వ అవుతుంని, వైయస్సార్ పార్టీ నాయకులు పట్టించుకోనే నాధులే లేరు. ఓట్లు కోసం ఎగబడి వస్తున్నారు ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.మాజనసేన పార్టీ తరుపున పోట్నూరు. ఈ కాలువలు మరియు నీరు తక్షణమే వృధా కాకుండా చేస్తే మంచిది లేకపోతే జనసేన పార్టీ తరపున గ్రామంలో సెక్రెటరీ కి మండలం డెవలప్ మెంట్ ఆఫీసర్ గార్కి జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ RTIకి సమాచారం హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 6(1) ప్రకారం అర్జీలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇవ్వడం జరుగుతుందన్నారు. వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకర్రావు, కృష్ణాపురం యువనాయకుడు లింగాల సూరిబాబు ప్రభుత్వం పై డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com